తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న పుజారా... ఇండియా భారీ స్కోరు!

  • 193 పరుగులు చేసి అవుట్ అయిన పుజారా
  • హాఫ్ సెంచరీ చేసిన హనుమ విహారి
  • భారత స్కోరు 429/6
సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలిరోజున దాదాపు రోజంతా గోడలా నిలిచిన ఛటేశ్వర్ పుజారా, రెండో రోజు తృటిలో డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. పుజారా 193 వ్యక్తిగత పరుగుల వద్ద లియాన్ బౌలింగ్ లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

మరోపక్క హనుమ విహారి, హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుని 53 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లియాన్ బౌలింగ్ లోనే లాబుస్ చగ్నేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం భారత స్కోరు 6 వికెట్ల నష్టానికి 429 పరుగులు కాగా, రిషబ్ పంత్ 51, రవీంద్ర జడేజా 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Go Back to Shorts
India
Australia
Cricket
Sydney

More Telugu News